: ఆ సంస్థపై కోపంతోనే 'బాహుబలి' సీన్లు లీక్ చేశాడా?


ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి' చిత్రంలోని కొన్ని సీన్లు యూ ట్యూబ్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దానిపై రాజమౌళి ఫిర్యాదుతో వర్మ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలో మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలో మేనేజర్ గా పనిచేసిన విషయం పోలీసు విచారణలో వెల్లడైంది. అతడు సంస్థ నుంచి ఇటీవల వెళ్లిపోయినట్టు తెలిసింది. మకుట సంస్థలో తనకు ఎదురైన అవమానాలకు ప్రతిగానే వర్మ సీన్లు లీక్ చేసినట్టు అర్థమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో అతడు సీన్లను తస్కరించినట్టు గుర్తించారు. ఆ సీన్లను వర్మ వాట్స్ యాప్, ఫేస్ బుక్ ద్వారా స్నేహితులకు పంపాడట. మొత్తం 13 నిమిషాల నిడివి ఉన్న 3 ప్రధాన సీన్లు యూట్యూబ్ లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఇంతకుముందు, పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా ఇలా విడుదలకు ముందే నెట్లో దర్శనమివ్వడం తెలిసిందే. కాగా, బాహుబలి సీన్లు లీకు వ్యవహారంలో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News