: మురళీమోహన్ ఇంట్లో రూ.30 లక్షల విలువైన నగలు చోరీ
నటుడు, ఎంపీ మురళీమోహన్ నివాసంలో నగలు చోరీకి గురయ్యాయి. హైదరాబాదు ఫిలింనగర్లోని నివాసంలో రూ.30 లక్షల విలువైన వజ్రాల హారం, వజ్రపుటుంగరం చోరీకి గురైనట్టు మురళీమోహన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై మురళీమోహన్ తనయుడు రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.