: సైనాపై 'బాయ్' ఆగ్రహం... కోర్టుకెళతామని హెచ్చరిక


జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనాపై కోర్టుకు వెళతామని హెచ్చరించింది. టోర్నీలో పాల్గొనాలంటూ సైనాకు నాలుగుసార్లు మెయిల్ చేశామని, లేఖలు కూడా పంపామని 'బాయ్' ఈవెంట్స్ విభాగం కార్యదర్శి పున్నయ్య చౌదరి తెలిపారు. అయినా, సైనా నుంచి స్పందన రాలేదని అన్నారు. కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చించి శిక్షణ ఇస్తుంటే, సీనియర్ ఆటగాళ్లు జాతీయ స్థాయి టోర్నీలు ఆడేందుకు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News