: నినాదాలు, నిరసనలతో దేశం ముందుకుపోదు: సోనియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగుపెట్టారు. బదర్పూర్ లో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, నినాదాలు, నిరసనలతో దేశం ముందుకెళ్లదంటూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చురకంటించారు. ఒకరేమో తప్పుడు హామీలిస్తారని, మరొకరు ధర్నాలకు మాత్రమే పరిమితమని పరోక్షంగా బీజేపీ, ఆప్ నుద్దేశించి విమర్శించారు. మద్దతిచ్చినా గానీ రెండు నెలలు కూడా పాలించలేక, బాధ్యతల నుంచి పారిపోయారని ఆప్ పై ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులకు ఎవరు బాధ్యులు? అంటూ ప్రశ్నించారు. ఇక, బీజేపీ విషయానికొస్తూ... సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన భారీ హామీలను తప్పక గుర్తుచేసుకోవాలని అన్నారు. తిరిగి దేశానికి తీసుకువస్తామని చెప్పిన నల్లధనం ఏదీ? ఉపాధి ఎక్కడ? ద్రవ్యోల్బణం తగ్గిందా? అంటూ మోదీ సర్కారుపై సోనియా ప్రశ్నల వర్షం కురిపించారు.