: 'కుటుంబ నియంత్రణ మాత్ర' పితామహుడు కార్ల్ జెరాస్సి కన్నుమూత


'కుటుంబ నియంత్రణ మాత్ర' పితామహుడిగా పేరుగాంచిన కార్ల్ జెరాస్సి (91) కన్నుమూశారు. బోన్ క్యాన్సర్, కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. జన్మతః ఆస్ట్రియా జాతీయుడైన జెరాస్సి అమెరికాలో స్థిరపడ్డారు. విఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. 1951లో మెక్సికో సిటీలో ఓ పరిశోధన బృందం సాయంతో జెరాస్సి కుటుంబ నియంత్రణ మాత్రల్లో కీలక పదార్థం నోర్ థిండ్రోన్ ను అభివృద్ధి చేశారు. ఈ మాత్ర రంగ ప్రవేశంతో మానవ జీవితంలో విశేషమైన మార్పులు వచ్చాయి. కాగా, జెరాస్సి రసాయన శాస్త్రజ్ఞుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కలం నుంచి ఎన్నో కవితలు, కథలు జాలువారాయి.

  • Loading...

More Telugu News