: మాక్స్ వెల్ ఆల్ రౌండ్ షో... ముక్కోణపు సిరీస్ విజేత ఆస్ట్రేలియా


యువ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో మాక్స్ వెల్ (95 పరుగులు, 4 వికెట్లు) బ్యాటింగ్, బౌలింగ్ లో విశేషంగా రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు 112 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 278 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' మాక్స్ వెల్ కు తోడు మిచెల్ మార్ష్ (60), ఫాక్నర్ (50 నాటౌట్), స్టీవెన్ స్మిత్ (40) రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 3, ఆండర్సన్ 2 వికెట్లు తీశారు. అనంతరం, లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 39.1 ఓవర్లలో 166 పరుగులకే చాప చుట్టేసింది. ఆరంభంలో జాన్సన్ (3 వికెట్లు), హేజిల్ వుడ్ (2 వికెట్లు) ధాటికి కకావికలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్... ఆ తర్వాత మాక్స్ వెల్ స్పిన్ కు దాసోహమైంది. ఆ జట్టులో రవి బొపారా (33) టాప్ స్కోరర్. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. భారత్ ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకుండానే ఈ ముక్కోణపు సిరీస్ నుంచి నిష్క్రమించడం తెలిసిందే. కాగా, ఈ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు దక్కింది.

  • Loading...

More Telugu News