: ఇంత జరుగుతున్నా చంద్రబాబు నోటిలోంచి ఒక్క మాటా రావడం లేదు: జగన్


తణుకులో రైతుదీక్ష ముగింపు సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు కక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులకు కొత్త రుణాలు రావడం లేదని, ఇవాళ రైతులు 14 శాతం వడ్డీ కడుతున్నారని పేర్కొన్నారు. ఉత్పత్తులు అమ్ముకోలేని స్థితిలో రైతన్న ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లోనూ సర్కారు ఇన్ పుట్ సబ్సిడీ గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నాయని, ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి వస్తుందని రైతుల ఆత్మహత్యలను చంద్రబాబు అంగీకరించడం లేదని జగన్ ఆరోపించారు. రైతులు పెద్ద ఎత్తున వలస వెళుతున్నారని, ఇంత జరుగుతున్నా ఆయన నోటిలోంచి ఒక్క మాటా రావడం లేదని విమర్శించారు. బతుకుదెరువు కోసం హైదరాబాదు వచ్చిన వాళ్లను రైతులు కాదంటున్నారని, ఇదెక్కడి న్యాయమని జగన్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆధార్ కార్డు ఉంటే రుణమాఫీకి అనర్హులంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ముడిపెడుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఓటు హైదరాబాదులో వేశారని, ఆయనకు ఆధార్ కార్డు హైదరాబాదులో ఉందని, అలాంటప్పుడు ఆయన ఏపీకి సీఎం ఎలా అయ్యారని నిలదీశారు.

  • Loading...

More Telugu News