: రాజమండ్రిలో ‘జగన్ దీక్ష’ బస్సు బీభత్సం... ముగ్గురి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు జనాన్ని తరలిస్తున్న బస్సు రాజమండ్రిలో కొద్దిసేపటి క్రితం బీభత్సం సృష్టించింది. నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద కారును ఢీకొన్న సదరు బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మూడు బైక్ లు ధ్వంసం కాగా, పలువురు గాయపడ్డారు. వెనువెంటనే స్పందించిన పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.