: జన జీవన స్రవంతిలోకి మావో నేత ఆర్కే అంగరక్షకులు... మెదక్ ఎస్పీ ఎదుట లొంగుబాటు


మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే- అక్కిరాజు హరగోపాల్)కు అంగరక్షకులుగా వ్యవహరించిన ఇద్దరు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డిలోని మెదక్ జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన మావోయిస్టు దళ సభ్యులు రెడ్డిబోయిన స్వామి అలియాస్ జనార్దన్, ఆయన భార్య శ్యామల అలియాస్ మాధవి జిల్లా ఎస్పీ సుమతి ఎదుట లొంగిపోయారు. జనార్దన్ పై రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు, మాధవిపై రూ.1 లక్ష రివార్డును ప్రకటించారు. దళంలో ఉండగా, ఆర్కేకు వీరు గన్ మెన్లుగా వ్యవహరించారని ఎస్పీ చెప్పారు.

  • Loading...

More Telugu News