: అంతర్వేదికి పోటెత్తిన భక్తులు... ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నేటి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అక్కడి ఉత్సవాల్లో భాగంగా నేడు జరగనున్న స్వామివారి వాహనసేవకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఆలయ పరిసరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. ఉత్సవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో, భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, స్వామివారి వాహనసేవకు పలు ప్రాంతాల నుంచి ఒకేరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అంతర్వేది పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో, భక్తుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.