: ఆంధ్రా బ్యాంకు బాటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు... వరంగల్ లో వినూత్న నిరసన


మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు ఆంధ్రా బ్యాంకు సిబ్బంది చేపట్టిన వినూత్న నిరసన మంచి ఫలితాలనే ఇచ్చినట్టుంది. అంతేకాదండోయ్, మొండి బకాయిలతో తలపట్టుకుంటున్న ఇతర బ్యాంకులకు కూడా సరైన మార్గాన్ని చూపినట్టుంది. ఆంధ్రా బ్యాంకు చేపట్టిన బాటలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బంది కూడా పయనిస్తున్నారు. వరంగల్ లోని మొండి బకాయిదారుల ఇళ్ల ఎదుట నేటి ఉదయం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బంది ధర్నాకు దిగారు. దీంతో బెంబేలెత్తిన బకాయిదారులు పరారైనట్లు సమాచారం. ఈ తరహా వినూత్న నిరసన ఆంధ్రా బ్యాంకు సిబ్బందికి కలిసి వచ్చిన మాదిరిగానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బందికి కూడా కలిసి వస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News