: జగన్ దీక్షకు ‘రాజధాని’ రైతులు... నేటి సాయంత్రం ముగియనున్న దీక్ష
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రెండు రోజుల దీక్ష నేటి సాయంత్రంతో ముగియనుంది. సాయంత్రం 4 గంటలకు దీక్ష విరమించనున్న జగన్, అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఇదిలా ఉంటే, జగన్ రెండో రోజు దీక్షకు నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులు హాజరయ్యారు. తుళ్లూరు పరిధిలోని పెనుమూరు, నిడమర్రు, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులు దీక్షకు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు.