: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పేస్ జోడి విజయం... మిక్స్ డ్ డబుల్స్ లో టైటిల్ కైవసం


మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ మరోమారు సత్తా చాటాడు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న పేస్, తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ మెరిశాడు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్ లో మార్టినా హింగిస్ తో కలిసి బరిలోకి దిగిన పేస్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితం ముగిసిన టైటిల్ పోరులో మ్లదనోవిచ్, నెస్టార్ జోడీపై పేస్, హింగిస్ జోడి జయకేతనం ఎగురవేసింది. వరుస సెట్లలో 6-4, 6-3 స్కోరుతో లియాండర్ పేస్ జోడీ, మ్లదనోవిచ్ జోడీని మట్టికరపించింది.

  • Loading...

More Telugu News