: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి


రాజస్థాన్లో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్పూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News