: ముంబై హీరోస్ ను మట్టికరపించిన తెలుగు వారియర్స్... ఫైనల్ చేరిక!
సీసీఎల్ సెమీస్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించారు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై హీరోస్ పై విజయం సాధించిన తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్ చేరింది. నేడు ఉప్పల్ లో జరగనున్న ఫైనల్ లో చెన్నై రైనోస్ తో తెలుగు వారియర్స్ టైటిల్ కోసం తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై హీరోస్ జట్టు 21 ఓవర్లలో 141 పరుగులు చేసింది. ఆ తర్వాత 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ జట్టు 146 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై హీరోస్ పై ఘన విజయం సాధించింది.