: 130 రోజుల 'బిగ్ బాస్ 8' విన్నర్ గౌతమ్ గులాటీ
భారతదేశ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ గా గౌతమ్ గులాటీ నిలిచాడు. మూడున్నర నెలలపాటు సాగిన బిగ్ బాస్ 8లో మొదట్లో వీకెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచిన టీవీ యాక్టర్ గౌతమ్ గులాటీ ఆటుపోట్లను తట్టుకుని విజేతగా నిలిచాడు. రియాలిటీ షోలో ఫైనల్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా గౌతమ్ గులాటీ, నటి కరిష్మా తన్నా, రేడియో జాకీ ప్రీతమ్ సింగ్, టీవీ నటుడు అలీఖులీ మీర్జా, టీవీ నటి డింపి గంగూలీలు నిలిచారు. ఇందులో ఫైనల్ ఎవిక్షన్ గా డింపి గంగూలీ, అలీఖులీ మీర్జా షో నుంచి నిష్క్రమించారు. బిగ్ బాస్ ఆఫర్ గా 25 లక్షల రూపాయలను అందుకునేందుకు సమ్మతించిన ప్రీతమ్ సింగ్ మూడవ కంటెస్టెంట్ గా నిలిచాడు. ఆ మొత్తం తీసుకునేందుకు గౌతమ్, కరిష్మా నిరాకరించారు. అత్యధిక అభిమానుల ఓట్లు గెలుచుకున్న గౌతమ్ విన్నర్ గా నిలవగా, కరిష్మాతన్నా రన్నర్ గా నిలిచింది.