: లోపాలున్నాయని సచివాలయాన్ని మార్చాల్సిన పనిలేదు...పరిష్కారాలున్నాయి: వాస్తు సిద్ధాంతి


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సచివాలయంలో చిన్న చిన్న వాస్తు లోపాలున్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం లేదని ప్రముఖ వాస్తు నిపుణులు సురేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు సిద్ధాంతాన్ని నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. సచివాలయానికి వాస్తు దోషం ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, ఈ లోపాలను వాస్తు సిద్ధాంతంలోని పరిష్కార మార్గాల ద్వారా సరిచేసుకోవచ్చని ఆయన సూచించారు. నైరుతీ వీధి పోటు వల్ల పాలకుడికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నమాట వాస్తవమన్న ఆయన, వాస్తులోనే దానికి పరిష్కార మార్గాలు కూడా సూచించిన మాట మరువకూడదని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ భవన్ కు ఉన్న వాస్తు దోషాలను కేసీఆర్ సవరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సచివాలయాన్ని యథాతథంగా కొనసాగిస్తూ వాస్తు మార్పులు చేస్తే సరిపోతుందని సురేష్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News