: జమ్మూ కాశ్మీర్ లో భారీ హిమపాతం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్ కు అవలాంచి (భారీ హిమపాతం) హెచ్చరికను భారత వాతావరణ కేంద్రం జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పర్యాటకులు హిమపాతం కురిసే ప్రాంతాల్లో పర్యటించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు ప్రభావం తగ్గకపోగా, దక్షిణాదిలో మంచు ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. శివరాత్రి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.