: ఒకే గ్రామంలో ఆసుపత్రిలో చేరిన 300 మంది
ఒకే గ్రామంలోని 300 మంది అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని కోలవెన్నులో నిన్న రాత్రి ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన గ్రామస్థులు, రాత్రి విందు చేశారు. అనంతరం ఈ మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరుగా ఆసుపత్రికి రావడం మొదలు పెట్టారు. సాయంత్రం అయ్యే సరికి గ్రామంలోని 300 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గ్రామాన్ని, గ్రామస్థులను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు. గ్రామస్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.