: మొక్కులకే 8 నెలలా? మరి హామీల అమలుకు?: షబ్బీర్ అలీ


తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కిన మొక్కులు చెల్లించేందుకే ఎనిమిది నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన లెక్కలేనన్ని హామీలు నెరవేర్చేందుకు ఎంత కాలం కావాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫాస్ట్ పథకం అంటూ ఇంతకాలం తెలంగాణలోని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుని, ఇప్పుడు వాస్తు పేరిట తెలంగాణ ఖజానా ఖాళీ చేస్తావా? అని ఆయన నిలదీశారు. ఇంతకాలం సచివాలయంలో పాలన జరగలేదా? పదేళ్లు ఆగితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఖాళీ కాదా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News