: కర్ణాటక బుల్డోజర్స్ పై చెన్నై రైనోస్ విజయం
కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్ మధ్య హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో జరిగిన సీసీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ లో చెన్నై రైనోస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన చెన్నై రైనోస్ ఆదిలోనే రమణ వికెట్ కోల్పోయింది. దీంతో కర్ణాటక బుల్డోజర్స్ చూడచక్కని బౌలింగుతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో విష్ణు వికెట్ కూడా కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన విక్రాంత్, పృథ్వీ చూడచక్కని షాట్లు కొడుతూ ఆకట్టుకున్నారు. విక్రాంత్ 91 పరుగులు సాధించగా, పృథ్వీ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై రైనోస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్లో చోటు సంపాదించుకుంది. రేపు ఫైనల్ జరగనుంది. కాగా, రెండో సెమీఫైనల్ లో తెలుగు వారియర్స్ జట్టు, ముంబై హీరోస్ తో తలపడనుంది. ఆటలో తమిళ, కన్నడ సినీ రంగాలకు చెందిన హీరో హీరోయిన్లు ఆకర్షణగా నిలిచారు.