: పైలట్ సీటు విడిచి వెళ్లాడు... విమానం నీట మునిగింది
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా జెట్ విమాన ప్రమాదంపై జరిగిన దర్యాప్తులో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జావా సముద్రంలో విమానం కుప్పకూలడానికి కొద్ది క్షణాల ముందు విమాన పైలట్ తన సీటు వదిలి వెళ్లిపోయాడట! ఆయన అటువెళ్లగానే విమానాన్ని అధీనంలోకి తీసుకున్న కో-పైలట్ విమానం మీద నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. పైలట్ తిరిగి వచ్చేసరికే చాలా ఆలస్యం అయిపోయి, విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. కాగా, ఆ విమానంలో అప్పటికే ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ సమస్యలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలడానికి కొన్ని రోజుల ముందు ఇదే విమానాన్ని ఆ పైలట్ సురక్షితంగా నడిపాడు. అప్పటికే విమానంలో సాంకేతిక లోపం ఉండడం విశేషం.