: సత్తా చూపిన సెరెనా... ఆసీస్ ఓపెన్ టైటిల్ సెరేనాదే


అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ సత్తా చూపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో మహిళల కిరీటాన్ని సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో సెరెనా విలియమ్స్ 6-3, 7-6 స్కోరుతో మరియా షరపోవాపై విజయం సాధించింది. ఈ విజయంతో సెరెనా ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను దక్కించుకుంది. కాగా, సెరెనా విలియమ్స్ కెరీర్ లో ఇది 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మహిళగా సెరెనా విలియమ్స్ రికార్డు పుటలకెక్కింది.

  • Loading...

More Telugu News