: జమ్ము, కాశ్మీర్ కు కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు మంజూరు
గతేడాది భారీ వరదలతో అతలాకుతలమైన జమ్ము, కాశ్మీర్ భారీగా నష్టపోయిన సంగతి విదితమే. ఆ వెంటనే రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం భారీ నష్టపరిహారం కూడా ప్రకటించింది. తాజాగా వరద సహాయం కింద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి జమ్ము, కాశ్మీర్ కు రూ.1,100 కోట్లు మంజూరు చేసింది. ఇంకా రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ కింద నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద అదనంగా రూ.20 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా మధ్య జరిగిన సమావేశంలో వీటికి అనుమతులు తెలిపారు. ప్రధానంగా రాష్ట్రం కోరిన రూ 41,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై చర్చించారు.