: ఆప్ నేత విశ్వాస్ పై బీజేపీ ఫిర్యాదు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పై భారతీయ జనతా పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు ఎన్నికల సంఘానికి కూడా బీజేపీ ఫిర్యాదు చేయనుంది. ఢిల్లీలో ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడిన కుమార్, బేడీపై లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. దాంతో ఆయనపైన ఫిర్యాదు చేయనుంది. అటు విశ్వాస్ తనపై చేసిన వ్యాఖ్యలపై బేడీ ట్విట్టర్ లో మండిపడ్డారు. ఇలాంటి ఆలోచన ఉన్న ఆప్ అధినాయకత్వం నుంచి మహిళలు ఎటువంటి రక్షణ, గౌరవం కోరుకుంటారని ప్రశ్నించారు.