: టెస్టులకు గుడ్ బై చెప్పిన విండీస్ ఆల్ రౌండర్


వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో మొత్తం 40 టెస్టులు ఆడిన డ్వేన్ బ్రావో... గత నాలుగేళ్లుగా టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని బ్రావో స్పష్టం చేశాడు. బ్రావో ఇప్పటిదాకా 147 వన్డేలు ఆడాడు. అయితే, మరో ఏడాది పాటు విండీస్ క్రికెట్ బోర్డుతో బ్రావోకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ... రానున్న ప్రపంచ కప్ కు మాత్రం అతను ఎంపిక కాలేదు. పారితోషికాల విషయంలో, విండీస్ బోర్డుతో ఆటగాళ్లకు చెలరేగిన వివాదంలో బ్రావోదే కీలక పాత్ర అని భావించిన బోర్డు అధికారులు అతనిపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News