: తెలుగు రాష్ట్రాల మధ్య గొడవతో లాభపడాలని బీజేపీ చూస్తోంది: మాజీ మంత్రి డొక్కా


కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నిప్పులు చెరిగారు. కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని... బీజేపీ ప్రభుత్వం వాటిని పరిష్కరించాల్సింది పోయి, సమస్యలను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరితే, మధ్యలో లాభపడాలనేది బీజేపీ ఎత్తుగడ అంటూ దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాల మధ్య వివాదాలు కోరుకోవడం బీజేపీకి మంచిది కాదని సూచించారు.

  • Loading...

More Telugu News