: శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంస
అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ క్షిపణితో భారత అణ్వాయుధాలకు మరింత శక్తి చేకూరిందని వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడారు. "అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి అగ్ని-5 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల టీమ్ కు కాంగ్రాట్స్! భారతదేశం గర్వించేలా చేశారు" అని జైట్లీ ట్వీట్ లో పేర్కొన్నారు.