: రెండు రోజుల జగన్ దీక్ష ప్రారంభం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల దీక్ష ప్రారంభమయింది. రైతులను, మహిళలను తెలుగుదేశం ప్రభుత్వం వంచిస్తోందని... దీనికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్టు జగన్ తెలిపారు. తొలుత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం జగన్ దీక్షలో కూర్చున్నారు. ఆయనకు సంఘీభావం తెలుపుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు... ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్ అన్నారు.