: విశాఖలో స్వైన్ ఫ్లూ పంజా... ఏడు కేసులు నమోదు


సుందర విశాఖ నగరాన్ని స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. నగరంలో కొత్తగా 7 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని జాయింట్ కలెక్టర్ నివాస్ ప్రకటించారు. వీరిలో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇద్దరికి ప్రైవేటు ఆసుపత్రిలో, ఒకరికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. మరో ఇద్దరి రక్త నమూనాలను పరీక్షల కోసం హైదరాబాదుకు పంపినట్టు తెలిపారు. నగరంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో... విశాఖ వాసులు కలవరపడుతున్నారు.

  • Loading...

More Telugu News