: పోలీస్ పంచ్ రుచిచూసిన శాండల్ వుడ్ నటుడు చేతన్!


బెంగళూరులోని కబ్బన్ పార్క్ ఎస్ఐ తనను అకారణంగా కొట్టాడని కన్నడ నటుడు చేతన్ నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మరో నటి, ఎంఎల్ఏ తారతో కలసి ఆయన కమిషనర్ ను కలిసారు. అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో చర్చ్‌ స్ట్రీట్‌ లోని తన మిత్రుడితో మాట్లాడుతుండగా, ఎస్ఐ నవీన్ వచ్చి తమను అక్కడినుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించాడని, ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరుగగా, నవీన్ తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని తెలిపారు. ఈ మేరకు చేతన్ పై పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయగా, వారు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, డ్యూటీలో ఉన్న తనను చేతన్ దుర్భాషలాడాడని, ఆయన క్షమాపణ చెప్పాలని సదరు ఎస్ఐ డిమాండ్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News