: ఎన్నికల్లో ఓడిపోతే ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ వర్శిటీల్లో బోధనకు వెళతా: కిరణ్ బేడీ
మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీ పడుతున్న సంగతి విదితమే. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని బేడీ పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఏం చేస్తారని ఓ ఆంగ్ల పత్రిక ప్రశ్నించగా, ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ వర్శిటీలకు వెళ్లి బోధిస్తానని అంటున్నారు. "ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్, కేమ్ బ్రిడ్జ్ యూనివర్శిటీల్లో ఇప్పటికే నాకు చాలా బోధన ఒప్పందాలున్నాయి. అవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. బీజేపీ సభ్యురాలిగా ఉంటూనే వాటికి వెళతా. అంతేగాక నా నవ్ జ్యోతి, ఇండియా విజన్ ఫౌండేషన్ ట్రస్టుకు కూడా వెళతాను" అని బేడీ పేర్కొన్నారు.