: నీటి బిల్లులు చెల్లించేందుకు చెక్కులిస్తే తీసుకోరు!


హైదరాబాదులో తాగునీటి బిల్లుల చెల్లింపు నిబంధనలను కఠినతరం చేస్తూ సర్కారు ఉత్తరువులు జారీచేసింది. ఇప్పటివరకూ ప్రజలకు వెసులుబాటుగా ఉన్న చెక్కుల విధానానికి స్వస్తి పలుకుతూ జలమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చెల్లింపు విధానంలో నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నీటి బిల్లుల చెల్లింపులన్నీ ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా జరగాలని జలమండలి రెవెన్యూ అధికారులు నేటి ఉదయం తెలిపారు. ఇందుకు www.esevaonline.telangana.gov.in, www.meeseva.gov.in, www.aponline.gov.in వెబ్‌సైట్లలో కానీ Axis-NEFT/Axis-RTGSలో గాని సంప్రదించాలని సూచించారు. వీటితో పాటు స్పాట్ బిల్లింగ్‌కు వచ్చే సిబ్బంది కానీ, సంస్థకు సంబంధించిన క్యాష్ కౌంటర్లలో కూడా బిల్లులు చెల్లించవచ్చని వివరించారు.

  • Loading...

More Telugu News