: గిన్నిస్ బుక్ లో హనుమాన్ చాలీసా పారాయణం
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. లక్షా 11 వేల మందికి పైగా భక్తులు ఏకకాలంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ బుక్ ప్రతినిధులు హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించినట్టు ప్రకటించారు. గణపతి సచ్చిదానంద స్వామికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా గిన్నిస్ బుక్ సర్టిఫికేట్ ను సచ్చిదానంద స్వామి అందుకున్నారు.