: ఢిల్లీలో నేడు మోదీ ఎన్నికల ర్యాలీ... భారీ భద్రత
ఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజధానిలో పీఎం నాలుగు ప్రచార ర్యాలీల్లో పాల్గొననున్నారు. దాంతో మిగతా ప్రాంతాల్లోనూ పోలీసులు భద్రత చేపట్టారు. ప్రధానంగా ప్రచారసభ జరిగే సీబీడీ గ్రౌండ్స్ లో ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక వేదిక నుంచి మూడంచెలుగా చెక్ పాయింట్లు పెట్టామని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. ర్యాలీకి వచ్చే వారందరినీ గ్రౌండ్ కు 50 మీటర్ల దూరంలోనే చెక్ చేస్తామని చెప్పారు. అంతేగాక వారిని, వెంట తీసుకొచ్చే బ్యాగ్ లను స్కానర్ మెషిన్లతో తనిఖీ చేస్తామని వెల్లడించారు.