: గాలికి రాచమర్యాదలు, 150 లడ్డూలు... టీటీడీ తీరుపై విమర్శల వెల్లువ
గనుల కుంభకోణం కేసులో సుమారు నాలుగేళ్ళపాటు జైల్లో గడిపి గతవారం బెయిలుపై విడుదలైన గాలి జనార్దన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం రాచమర్యాదలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్వామి వారి దర్శనార్థం తిరుమలకు మందీమార్బలంతో వచ్చిన ఆయనకు వీఐపీలు బస చేసే శ్రీ కృష్ణదేవరాయ అతిధి గృహంలో గదులు కేటాయించడంతో పాటు అత్యంత ప్రాధాన్యతగల ముఖ్యులకు మాత్రమే ఇచ్చే ఎల్-1 కేటగిరి టికెట్లను 17 ఇచ్చింది. టీటీడీ అధికారులు దగ్గరుండి వారికి దర్శనం చేయించడంతో పాటు 150 లడ్డూలు, భారీగా ఇతర ప్రసాదాలు ఇచ్చి సకల మర్యాదలూ చేశారు. ఒక నిందితుడికి ఇటువంటి మర్యాదలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.