: చింతచెట్టు నుంచి పొగలు... నెల్లూరు జిల్లాలో కలకలం... చెన్నకేశవ స్వామి ఆగ్రహమే..!


నెల్లూరు జిల్లా మహిమనూరులో కలకలం చెలరేగింది. గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన చెన్నకేశవాలయాన్ని తిరిగి నిర్మించాలన్న ఉద్దేశంతో కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడి ఎదురుగా ఉన్న చింత చెట్టు నుంచి పొగలు రావడం ప్రారంభమయింది. దీన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆలయం కూల్చివేతతో అరిష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామి ఆగ్రహం వల్లే చింతచెట్టు నుంచి పొగలు వస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రివేళ ఈ పొగలు వస్తున్నాయని గ్రామస్తులు చెప్పారు. పొగలు కక్కుతున్న చింతచెట్టును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

  • Loading...

More Telugu News