: జయంతి నటరాజన్ ను ప్రశ్నించనున్న సీబీఐ!


కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి, నిన్న కాంగ్రెస్ పార్టీని వీడిన జయంతి నటరాజన్ పై సీబీఐ కన్ను పడింది. ఆమె పదవిలో ఉండగా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించి అయిదు కేసుల్లో ప్రాథమిక విచారణ చేపట్టాలని నిర్ణయించింది. గనులకు ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని భావిస్తున్న సీబీఐ అతి త్వరలో ఆమెను ప్రశ్నించనున్నట్టు సమాచారం. తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను పరిశీలించామని, వాటి పత్రాలను సేకరించామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆమె తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని తొలుత విచారించాలన్నది సీబీఐ అభిమతంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News