: బాపట్లలో సందడి చేసిన నటి అంజలి... ఎగబడ్డ అభిమానులు!
బాపట్ల పట్టణంలో సినీ రచయిత కోన వెంకట్ ఏర్పాటు చేసిన 'కోన అండ్ కూచిపూడి' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సినీనటి అంజలి వచ్చి సందడి చేసింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, కూచిపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్ ను ప్రారంభించిన తరువాత వంటకాలను రుచి చూసిన అంజలి తనకు తెలుగన్నా, తెలుగు వంటలన్నా ప్రాణమని చెప్పారు. గీతాంజలి వంటి సినిమాలు చేసేందుకు అవకాశం కల్పించిన కోన వెంకట్ ను ఎప్పటికి మరచిపోనన్నారు.