: పేలిన మరో గ్యాస్ సిలిండర్... ఐదు ఇళ్లు దగ్ధం
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఈ ఉదయం దారుణం జరిగింది. మండల పరిధిలోని సింగుపాలెంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదు ఇళ్లు దగ్ధం అయినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే పాలు కాచుకునేందుకు ఉపక్రమించిన ఓ మహిళ స్టవ్ వెలిగించగానే సిలిండర్ ఒక్కసారిగా పేలినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.