: రేవంత్... దమ్ముంటే ఆరోపణలు నిరూపించు... లేకుంటే పరువునష్టం కేసు వేస్తా!: హరీశ్‌ రావు


తెలంగాణలో ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నాయని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. ఆయనకు దమ్ముంటే ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నాయని 24 గంటల్లోపు నిరూపించాలని, లేకుంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేస్తానని హరీశ్‌ రావు హెచ్చరించారు. రాజకీయాల్లో పుట్టగతులుండవనే భయంతోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆది నుంచీ రేవంత్‌ రెడ్డికి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు అలవాటేనని హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. ప్రముఖులను విమర్శిస్తే తాను పెద్దవాడినైపోతాననే ఉద్దేశంతోనే రేవంత్‌ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్‌ రావు దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News