: తిరుమలలో గంటా, గాలి
ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ తదితరులు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా, సామాన్య భక్తులు అరుదైన సేవల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న టీటీడీ ఫిబ్రవరి నెల లక్కీడిప్ కోటాను విడుదల చేసింది. ఇందులో తోమాలసేవ 15 టికెట్లు (ఒకరికి రూ. 220), అర్చన 132 (ఒకరికి రూ. 220), మేల్‌ఛాట్‌వస్త్రం 4 (దంపతులకు రూ. 12,250), పూరాభిషేకం 24 (ఒకరికి రూ. 750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి.