: సినీ రచయిత 'మచ్చ' రవి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడిన టాలీవుడ్ సినీ రచయిత బి.వి.సుబ్రమణ్యం అలియాస్ మచ్చ రవి డ్రైవింగ్ లైసెన్సును 6 నెలలపాటు అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు రెండు సార్లు పట్టుబడిన రితీష్సింగ్, మరో వ్యాపారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయినట్టు ఆయన వెల్లడించారు. మద్యం సేవించి తొలిసారి పట్టుబడితే జైలుశిక్ష లేదా జరిమానా, రెండోసారి పట్టుబడితే ఈ రెండింటితోపాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.