: ప్రపంచ కప్ అని మర్చిపోయినట్టున్నారు: గవాస్కర్


ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు టోర్నీలో ప్రణాళికలు అమలు చేయడంలో ధోనీ వైఫల్యం చెందాడని గవాస్కర్ తెలిపారు. ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, రానున్నది ప్రపంచకప్ అని టీమిండియా మర్చిపోయినట్టుందని ఆయన అన్నారు. టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ, ధోనీ అతన్ని సరిగా వినియోగించుకోలేదని పేర్కొన్నారు. ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడి కోటాను ధోనీ పూర్తి చేయనివ్వలేదని గవాస్కర్ వెల్లడించారు. ఆశావాదినని పేర్కొన్న గవాస్కర్, టీమిండియా ఓటమి పాలుకావడం తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఆస్ట్రేలియాలో స్టేడియాలు పెద్దవి అన్న సంగతిని బిన్నీ మరచినట్టున్నాడని, ఇక్కడ కట్ అండ్ పుల్ షాట్లు ఆడితే బాగుంటుందని గవాస్కర్ హితవు పలికాడు.

  • Loading...

More Telugu News