: నిరుద్యోగే...15 మంది భార్యలతో... 26 మందిని కన్నాడు!


బ్రిటన్ చట్టాలను ఆసరాగా చేసుకుని ఓ నిరుద్యోగి... కాదు కాదు, సోమరిపోతు 15 మంది భార్యలతో 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగపిల్లలు. వారి వయసు నాలుగేళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది. కాగా, ఈ సోమరి వయసు 64 ఏళ్లు. పీటర్ రోల్ఫీ అనే బ్రిటిషర్ కి ఉద్యోగం చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. దీంతో బ్రిటన్ చట్టాలను ఆసరా చేసుకుని గంపెడు సంతానం కనేశాడు. బ్రిటన్ చట్టాల ప్రకారం నిరుద్యోగులకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిల్లల పోషణార్థం కూడా నెలనెలా డబ్బివ్వాలి. దీనిని ఆసరాగా చేసుకుని బ్రిటన్ లో చాలా కుటుంబాలు పనీపాటా లేకుండా బతికేస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ సంస్కరణల పేరిట ఈ నిబంధనలు ఎత్తేయాలని చూడగా, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కొన్ని కటింగ్ లతో నిబంధనలను కొనసాగిస్తున్నారు. దీంతో గంపెడు సంతానం కన్న పీటర్ మూడు పడక గదుల ఇంట్లోకి చేరాడు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందన్న చందాన, వారికి ఇళ్లు సరిపోవడం లేదు. దీంతో తనకు మరో ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. వారు నిరాకరించడంతో కోర్టుకెక్కాడు. న్యాయస్థానం ఆదేశాలతో ఐజిల్ ఆఫ్ వైట్ ద్వీపంలో ఐదు బెడ్ రూంల ఇల్లు కేటాయించారు. తీర్పు ఆలస్యం కావడంతో తనకు 93వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వ న్యాయ సహాయకుడికి నోటీసులు పంపాడు. ఇప్పటికే పీటర్ కుటుంబ పోషణార్థం ప్రతిఏటా 47 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని, ఇంకా చెల్లించడానికి ఏమీ మిగల్లేదని ప్రభుత్వాధికారులు పేర్కొంటున్నారు. దీనిపై మరోసారి కోర్టుకెక్కుతానని పీటర్ శపథం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News