: 'బాహుబలి' లీకు వీరుడు దొరికాడు


బాహుబలి సినిమాలోని కొన్ని సీన్స్ దొంగిలించి యూట్యూబ్ లో పెట్టాడని భావిస్తున్న అనుమానితుడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి. ఏడాదిన్నర కాలంగా సినీ నిర్మాణంలో తలమునకలై ఉన్న సినిమా యూనిట్ అప్పుడప్పుడు కొన్ని మేకింగ్ సీన్లను విడుదల చేస్తూ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమా తొలి భాగాన్ని ఈ వేసవికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలోని యుద్ధసన్నివేశాలను లీక్ చేసిన వార్తలు భగ్గుమన్నాయి. దీంతో యుద్ధప్రాతిపదికన స్పందించిన ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు క్షణాల్లో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీడియో నిడివి ఒక నిమిషం, ఉండగా, సినిమాలోని హీరో లుక్, సాంకేతిక నిపుణల పనితనానికి సంబంధించి 12 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News