: ఇగో దరిచేరనీయను: అమితాబ్


తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. సెలబ్రిటీనైనా తనకు ఇగో లేదంటున్నారు. కెరీర్ లో ఎప్పుడూ ఇగోను దరిచేరనీయలేదని స్పష్టం చేశాడు. సొంత ప్రయోజనాలను పట్టించుకోలేదని, ఇతరుల విషయం తనకు తెలియదన్నాడు. తాజాగా ఆయన నటించిన 'షమితాబ్' విడుదలవ్వాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. ఎల్లప్పుడూ తనను తాను సాధారణ వ్యక్తిలా భావించుకుంటానని పేర్కొన్నారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తానిచ్చిన జవాబులను 'బిగ్ బి' బ్లాగులోనూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News