: చిత్రావతి నది సమీపంలో భూమి కుంగిపోతోందట!


అనంతపురం జిల్లాలో భారీ గొయ్యి కలకలం రేపుతోంది. చిత్రావతి నది సమీపంలోని పుట్లూరు మండలం లక్షుంపల్లి గ్రామం సమీపంలో గత రాత్రి భారీ శబ్దంతో ఓ గొయ్యి ఏర్పడింది. ఏం జరిగిందోనని హడలిపోయిన జనం వచ్చి చూసేసరికి అక్కడ గొయ్యి దర్శనమిచ్చింది. చిన్నదిగా ఏర్పడిన ఈ గొయ్యి క్రమంగా విస్తరిస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జియాలజీ నిపుణులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా, గొయ్యి విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దానిని చూసేందుకు ఎగబడుతున్నారు.

  • Loading...

More Telugu News