: తమిళనాడులో 'ఘర్ వాపసీ'... 9 మంది మత మార్పిడి


దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయినప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 'ఘర్ వాపసీ' కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తమిళనాడులో దశాబ్దం నుంచి క్రిస్టియన్లుగా ఉన్న తొమ్మిదిమంది మళ్లీ హిందూమతం తీసుకున్నారు. ఇందులో మూడు జంటలు ఉండటం గమనార్హం. వారంతా సబర్బన్ మింజుర్ ప్రాంతానికి చెందిన నిర్మాణ కూలీలని తెలిసింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వినాయకుడికి సుదీర్ఘ పూజ చేసిన తరువాత వారిపై గంగా నీరు చల్లి, అంక్షితలు వేశారు. ఆ రాష్ట్ర హిందూ మక్కల్ కట్చి జనరల్ సెక్రెటరీ రామ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ తంతు నిర్వహించారు.

  • Loading...

More Telugu News