: కట్నం డబ్బుతో ఉడాయించిన పెళ్లికొడుకు
తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం అంబేద్కర్ కాలనీలో కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ పెళ్లికొడుకు కట్నం డబ్బుతో ఉడాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వధువు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం కాగా, అంతలో వరుడు పరారయ్యాడన్న విషయం తెలియడంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వధువు కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది. రూ.3 లక్షలతో వరుడు ఉడాయించడంతో వాళ్లు తీవ్ర విచారంలో కూరుకుపోయారు. పెళ్లి కొడుకు పరారీకి కారణాలు తెలియరాలేదు.